పరిశుద్ధ స్త్రీ|Holy Women| Telugu Christian Pdf Books

పరిశుద్ధ స్త్రీ|Holy Women| Telugu Christian Pdf Books this was written By Srmt. Kejiya Vara Prasad Reddy This book was about how Jacob and Rahel in the bible, Abraham and Sarah in holy women bible books, Gospel needs books, Telugu christian website

పరిశుద్ధ స్త్రీ|Holy Women| Telugu Christian Pdf Books

గ్రంథ పరిచయము

“పరిశుద్ధ గ్రంథము నందలి (స్త్రీల- పుస్తక పరిచయము” అను ఈ పుస్తకమును వ్రాయుటకు నన్ను ప్రేరేపించిన మన ప్రభువును, రక్షకుడును, మన బోధకుడైన, యేసుక్రీస్తుకు నా శతకోటి వందనములు చెల్లిస్తున్నాను. నన్ను రక్షించినది మొదలుకొని తన సేవా పరిచర్య విషయమై కీర్త. 68:11వ.లో వ్రాయబడినట్లు బైబిల్ స్త్రీలను గురించి తన విలువైన వాక్య తలంపులను గ్రంథస్తము చేయుటకు ప్రభువిచ్చిన కృపాసహాయమునుబట్టి ప్రభువును స్తుతిస్తున్నాను.

పుస్తకము మరీ పెద్దది కాకుండు నిమిత్తమై కొన్ని వాల్యూమ్ గా బైబిల్ స్త్రీలను గూర్చియు, వారి కుటుంబాలను గూర్చియు వ్రాయాలనుకున్నాను. ఈ మొదటి వాల్యూమ్ లో శారాను గూర్చియు, ఆమె కుటుంబములో అధిమంది వ్వకులను గూర్చియు, అనగా ఆమె భర్తయైన అబ్రహామును గూర్చియు, ఆమె మామగారైన తెరహును గూర్చియు, ఆమె దాసియైన హాగరును గూర్చియు, ఆమె బంధువైన లోతును గూర్చియు వ్రాయడం మంచిదని తలంచాను. కారణం, వారందరి జీవితాల ద్వారా ప్రభువు మనకు విలువైన హెచ్చరికలను, విలువైన పాఠాలను నేర్పుతారని నమ్ముచున్నాను.

అంతేకాక ఈ వాల్యూమ్ లో శారా కోడలైన రిబ్కాను గూర్చియు, రిబ్కా కోడళ్లిన రాహేలు, లేయాను గూర్చియు నేర్చుకోబోతున్నాము. మున్ముందు మరికొన్ని వాల్యూమ్స్ లో బైబిలు సోదరీలను గురించి వ్రాయుటకు ప్రభువు కృపనిస్తారని నమ్ముచున్నాను. ఇక ప్రభువు మనతో మాట్లాడులాగున ప్రార్థనా పూర్వకముగా ఈ పుస్తకాన్ని చదువుదాం. ఈ పుస్తకము ద్వారా మన ప్రభువుకే ఘనతా, మహిమ, ప్రభావములు కలుగును గాక! అలాగే స్త్రీ

జాతికి ఆత్మీయ మేలు కలుగును గాక!

ಇಟ್ಟು

మన ప్రభువునందు - మీ, కెజియక్క