Randi Suvaartha Sunaadamutho ll రండి సువార్త సునాదముతో |Song With Lyrics-Free Download
Randi Suvaartha Sunaadamutho|రండి సువార్త సునాదముతో |Song With Lyrics-Free Download,Randi Suvaartha Sunaadamutho free Download Mp3, Randi Suvaartha Sunaadamutho telugu Christian song, Christian old Hits, Telugu csi songs, Randi Suvaartha Sunaadamutho andra kristhava keerthanalu, తెలుగు క్రిస్టియన్ సాంగ్స్

Download Powerpoint presentation | Download Lyrics |
Randi Suvaartha Sunaadamutho|రండి సువార్త సునాదముతో - Telugu Christian Website, Telugu Christian Song
రండి సువార్త సునాదముతో - రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో - ప్రభుయేసు దయానిధి సన్నిధికి
1. యేసే మానవ జాతి వికాసం - యేసే మానవ నీతి విలాసం
యేసే పతిత పావన నామం - భాసుర క్రైస్తవ శుభనామం !!రండి!!
2. యేసే దేవుని ప్రేమస్వరూపి - యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం - ఆశ్రిత జనముల సుఖవాసం !!రండి!!
౩. యేసే సిలువను మోసినదైవం - యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం - దాసుల ప్రార్థన సహకారం !!రండి!!
4. యేసే సంఘములో మనకాంతి - యేసే హృదయములో ఘనశాంతి
యేసే కుటుంబ జీవనజ్యోతి - పసిపాపల దీవెన మూర్తి !!రండి!!
5. యేసే జీవన ముక్తికి మార్గం - యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శాంతికిసూత్రం - వాసిగనమ్మిన జనస్తోత్రం !!రండి!!