2nd-October|విశ్వాసమే విజయం-viswasamey vijayam|Telugu Daily Devotions

2nd-October, విశ్వాసమే విజయం-viswasamey vijayam, Faith is the Victory, Telugu-Daily Devotions by Laymen's Evangelical Fellowship, A Telugu Christian Spiritual Daily Devotion was written by Dr Joshuva Daniel, for more spiritual content please visit Lefi. org

Download Pdf  Download .MP3 Voice

విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - Viswasamey Vijayam-Telugu Christian Devotion

విశ్వాసమే విజయము-అక్టోబర్-2

దేవుని మహిమ

 "యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు?  పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యనీయుడవు, అద్భుతములను చేయువాడవు"  ( యెషయా 15:11 )

              దేవుని బిడ్డలు ఎక్కడ కూడుకున్నను పరిశుద్ధత, ప్రేమయను దేవుని మహిమ వారి చుట్టూ నుండవలెను. ఇక్కడ వారు దేవుని యొక్క భయంకరమైన హస్తము సైన్యముల మీద దిగుట, సాక్షాత్తు దేవుని మహిమను చూచిరి.

            యేసుక్రీస్తు ప్రభువు యీ భువిని సంచరించినప్పుడు ప్రజలు ఇట్లనిరి.  "ఇశ్రాయేలీయులులో ఈలాగు ఎన్నడు కనబడలేదు" ( మత్తయి 9:33 ) ఇటీవల దీనిని నేను చదివినప్పుడు ఇండియా దేశప్రజలు ఇండియా దేశములో ఈలాగు ఎప్పుడును కనబడలేదని ఎందుకు పలుకరు?  దానికి కారణము కేవలము మన ఆత్మీయ కొరతయే. ఒక నిర్జీవమైన విగ్రహము అంత వైభవముగా కనుపించినప్పుడు మనలో జీవించుచున్న పునరుత్థానుడైన రక్షకుడు ఇంకా ఎంత మహిమకరముగా కనిపించవలసినది! ఆయన యొక్క శక్తి ప్రభావములు మన చుట్టూ నున్న ప్రజలకు కనిపించకుండా మనమే ఆటంకమైయున్నాము.  "పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యనీయుడవు, అద్భుతములను చేయువాడవు".

      ఒక వజ్రమును గూర్చి ప్రచురము చేయనవసరము లేదు. తానే ప్రకాశించును. మనము యేసుక్రీస్తును కలిగియుండి, మన పవిత్ర జీవితము ద్వారా ఆయనను ప్రకటించినయెడల ప్రజలు  "ఇట్టి పవిత్రమైన జీవితములను జీవించు యవ్వనస్థులను వేరే ఎక్కడును చూడము"  అని అందురు. కుటుంబములను కూడ అట్లు సంతోషముగా చూడమని యందురు.

          మనము ఆయన కార్యములను రుచి చూచినప్పుడు వాటిని గురించి సందేహము లేకుండా నిశ్చయతతో మాట్లాడవలెను. ఒక కేంద్ర కాంగ్రెస్ కమిటి సభ్యునితోను, పార్లమెంటు సభ్యునితోను నేను ప్రయాణము చేయుచున్నప్పుడు వారు  "నీవు యేసుక్రీస్తును గురించి ఇంత నిశ్చయతతో మాట్లాడుచున్నావే"  యనిరి. అవును, నా రక్షకుడు అద్భుతమైన రక్షకుడని నేను చెప్పగలను. ప్రజలు దాని చూడగలరు. సమస్తమును ఆయన మహిమను ప్రచురము చేయును గాక!

                                 ~జాషువా డానియేలు

for more Spirutuval Telugu Christian Devotions -Laymen's Evangelical Fellowship, Lefi. org

Telugu Christian Songs, Telugu Christian Website-Gospel Needs