22nd-October||విశ్వాసమే విజయం-viswasamey vijayam||Telugu Daily Devotions

22nd-October,విశ్వాసమే విజయం-viswasamey vijayam, Faith is the Victory, Telugu-Daily Devotions by Laymen's Evangelical Fellowship, A Telugu Christian Spirutuval Daily Devotion was written by Dr Joshuva Daniel, for more spiritual content please visit Lefi. org

Download Pdf  Download .MP3 Voice

విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - Viswasamey Vijayam-Telugu Christian Devotion

విశ్వాసమే విజయము-అక్టోబర్ 22

 జీవిత తుఫానులు

వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించి పోవుచున్నాము మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి   ( మత్తయి 8 :25 )

        సముద్రము మధ్యలో శిష్యులు నిజంగా అపాయంలో ఉన్నారు. వారెన్నడు ఇలాంటి  తుఫానును చూచియుండలేదు. ప్రతివారు తమ జీవితంలో తుఫానులను ఎదుర్కొంటారు ఒకసారి మేడ మీద నున్న గడ్డితో కప్పిన పాకలో చిన్న పిల్లలతో పాటు మేము నిద్రించుచుండగా భయంకరమైన తుఫాను రేగినది దగ్గరలో లో ఉన్న చెట్లు వేర్లతో సహా ఊడబెరికినట్లు పడిపోయాయి గాని మా పాక కనీసం కదలలేదు. జీవితంలో  పెద్ద తుఫానులు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు దేవుని దగ్గరకు వెళ్తారు. అలా ఉండకూడదు అయితే మనము ఎల్లప్పుడు ఆయన యొద్దకు వెళ్లాలని దేవుడు కోరుచున్నాడు.

  అప్పటికే శిష్యులు అనేక అద్భుతాలు చూచారు కానీ ఈ తుఫాను వారిని భయముతో కేకలు వేయునట్లు చేసినది. తుఫాను వచ్చినప్పుడే విశ్వాసము ప్రయోగించబడుతుంది "అప్పుడు నీవు పిలువగా యోహావా ఉత్తరమిచ్చును." (యెషయా58:9 ) యేసుతో పాటు ఉండుట చాలా మంచిది. ఆయన మెళుకువగా ఉన్నపుడు చేసిన అద్భుతాలు - రోగులను స్వస్థపరుచుట, కుంటి,  గ్రుడ్డి వారిని బాగుచేయుట మున్నగునవి చూచినప్పుడు శిష్యుల విశ్వాసము అభివృద్ధి చెందినది. అయితే ఆయన నింద్రించుచుండగా పెద్దగాలి వీచినది. కనుక అసలైన విశ్వాస పరీక్ష వచ్చింది. నీవు దేవునితో సరియైన సంబంధాన్ని కలిగియుండకపోతే ఆయనను లేపటానికి నీవు భయపడుతావు.

  తుఫాను మొదలైన వెంటనే శిష్యులు ఆయనను నిద్ర లేపలేదు. అది వారి విశ్వాసము. వారు యేసునే చూస్తున్నారు. ఒకరినొకరు వాదించుకొంటూ ఆయన వైపు వ్రేలు చూపిస్తున్నారు. తుఫానులు వచ్చునప్పుడు నీ చేతులు కూడా ఆయన వైపు లేస్తాయి. ఆయన వెంటనే మేల్కొనలేదు.కారణము? అవి విశ్వాస పరీక్షలు గనుక వాటిని కొంత సేపు రేగనిస్తాడు. యేసుపై విశ్వాసమును వదులుకొనమని ఆఫ్రికాలో ఒక అమ్మాయిని హింసించారు.ఒక చెట్టుకామెను కట్టి ఆ రాత్రి అంతా అక్కడే ఉంచారు. ఒక సింహము దగ్గరకు వచ్చినా అది ఆమెను ఏమి చేయలేదు.ఈ అనుభవముల ద్వారా ఆమె విశ్వాసము వృద్ధి చెందినది.దేవునిపై నమ్మిక కలిగిన వారికి ఎలాంటి కలవరము రాదు.

  "మేము నశించుచున్నాము"అని వారనుకొనుచున్నారు. నీ పడవలో యేసు ఉన్నప్పుడు నీవు నశించగలవా? నీవు దేవుని వాక్కులను పట్టుకొని వాటి ననుసరించి జీవించుచున్నావా? ఆయన నిద్రుంచుచున్నట్లు ఉన్నప్పటికీ నీవు ఆయనను పిలుస్తావు. ఆ అలలు అణిగి నిమ్మళ్లిస్తాయి. నీవు ఆనందముతో నింపబడతావు.

                   యన్.దానియేలు

 for more Spirutuval Telugu Christian Devotions -Laymen's Evangelical Fellowship, Lefi. org

Telugu Christian Songs, Telugu Christian Website-Gospel Needs