8th-October|విశ్వాసమే విజయం-viswasamey vijayam|Telugu Daily Devotions

8th-October, విశ్వాసమే విజయం-viswasamey vijayam, Faith is the Victory, Telugu-Daily Devotions by Laymen's Evangelical Fellowship, A Telugu Christian Spiritual Daily Devotion was written by Dr Joshuva Daniel, for more spiritual content please visit Lefi. org,

Download Pdf  Download .MP3 Voice

విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - Viswasamey Vijayam-Telugu Christian Devotion

విశ్వాసమే విజయము-అక్టోబర్-8

నీ దేవుని కలిసికొనుటకు  నిన్ను నీవు సిద్దపరచుకొము

"​నీవు సిధ్దముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతోకూడ కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలియై యుండవలెను." (యెహేజ్కేలు 38: 7)

               నీవు సిద్ధముగా ఉండుము అను దాని విషయం శ్రద్ధ చూపాలి. ఎవరో మనకు కీడు చేశారని తలంచుచుందము. ఆదాము తన తప్పును గ్రహించలేదు. హవ్వను నిందించాడు. మన స్వభావము ఇతరులను నిందించుటయే. నీవు సిద్ధముగా ఉండుము అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. యౌవనస్తుడా ప్రవక్తవలె ఉండుటకు నిన్ను నీవు సిద్దపరచుకొము. బాప్తిస్మమిచ్చు యోహాను తన్ను తాను సిద్ధపరచుకుంటున్నాడు. అతడు సిద్ధపాటు స్థలముగా అరణ్యము ఎంచుకొనుట ఆశ్చర్యము. ఒక క్రైస్తవుడు అనేక రకాలుగా ఉండుటకు సిద్ధపడాలి. బాప్తిస్మమిచ్చు యోహాను దేవుని వ్యాఖ్యాన కర్తగా సిద్ధపరచుకొన్నాడు. ఒకరు చేసే అతి గొప్ప పని తనను తాను సిద్ధపరచుకొనుట. ఫరోకు నిన్ను దేవునిగా చేసెదను అని దేవుడు మోషేకు చెప్పటంలో అర్థం ఏమనగా "నీవు పలికే మాటలు ప్రవచనాల వలె నెరవేర్చబడును". అదే ప్రవచనాత్మ. ప్రవచనాత్మ ఉండాలంటే నిన్ను నీవు ఖాళీ చేసుకోవాలి.

                బాప్తిస్మమిచ్చు యోహాను తన్నుతాను రిక్తునిగా చేసుకొన్నాడు. మిడతలు, అడవి తేనెను ఆహారంగా తీసుకున్నాడు. అలాంటి సామాన్య ఆహారము భుజించినను ఆత్మలో బలశాలిగా ఉన్నాడు. మనమైతే ఎంత తినాలి, రుచికరమైన ఆహారంగా ఉందా?  అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాము. మంచి మంచి పదార్థాలను తినలేని ఒక స్థలమునకు బాప్తిస్మమిచ్చు యోహాను వెళ్ళినాడు. నీవు సిద్ధముగా నుండుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలసిన సమూహమంతటిని సిద్దపరచుము తనను తాను సిద్ధపరచుకొననివాడు సంఘాన్ని సిద్ధపరచలేడు. నిన్ను నీవు సిద్ధపరచుకొనకుండా ఇతరులను ఎలా సిద్ధపరచుదువు?

                  నీవు సిద్ధపడి నీతో కూడ ఉన్న వారిని సిద్ధపరచి, వారికి కావలియై యుండుము అనునది క్లిష్టమైన పని. పిల్లలకు కావలిగా ఉండుట తల్లిదండ్రులకు అసాధ్యంగా ఉంటున్నది. బోధించుట సుళువే కానీ కావలిగా ఉండుట కష్టము.

             మనలో ఎంత మందిమి మన కుటుంబాలకు కావలిగా ఉన్నాము. మనలో ఎంతమంది మనం పనిచేసే చోట్ల ఇతరులకు కావలిగా ఉన్నాము. ఈ పని చాలా కష్టమైన పని. "నీవు సిద్ధపడి, నీతో కూడా ఉండు వారికి కావలియై యుండుము" ఇట్లు చేయుటకు వేసే ప్రతి అడుగునకు దేవుని కృప, నడిపింపు పొంది, ఈ గొప్ప బాధ్యతను చేపట్టాలి.
             

                       ~యన్. దానియేలు

for more Spirutuval Telugu Christian Devotions -Laymen's Evangelical Fellowship, Lefi. org

Telugu Christian Songs, Telugu Christian Website-Gospel Needs